“సారంగ దరియా” సెన్సేషన్..మరో మైల్ స్టోన్.!

Published on Apr 23, 2021 2:00 pm IST

అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ”. టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇది వరకే శేఖర్ కమ్ముల సినిమాలు ఆడియో పరంగా ఎలాంటి సెన్సేషన్ ను సెట్ చేస్తాయో తెలిసిందే. అలాగే ఈ సినిమాలో కూడా ప్రతీ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది.

అలా వాటిలో సాయి పల్లవిపై సెట్ చేసిన స్పెషల్ సాంగ్ “సారంగ దారియా” అయితే రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తుంది. మరి అలా ఈ సాంగ్ ఇప్పుడు మరో మైల్ స్టోన్ ను టచ్ చేసింది. రీసెంట్ గా 150 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసి సౌత్ ఇండియన్ సినిమాలో మరో రికార్డు సెట్ చేసింది. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రమే గత వారంలోనే విడుదల కావాల్సి ఉంది కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల వాయిదా వేశారు. అలాగే వచ్చే మే లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మరి అప్పటికి అయినా విడుదల అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :