చైతు ‘లవ్ స్టోరీ’ కోసం ప్రత్యేకమైన సెట్ !

Published on Aug 10, 2020 3:55 pm IST

మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. టాలీవుడ్ లో బలమైన ఎమోషనల్ కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరు ఉన్న శేఖర్ కమ్ముల, ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో ఈ ‘లవ్ స్టోరీ’తో రాబోతున్నాడు.

కాగా ఈ సినిమా అక్టోబర్ 20 నుండి షూటింగ్ రెడీ కానుంది. షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన విలేజ్ సెట్ కూడా వేస్తున్నారట . ఇక ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న ఈ సినిమా మరి తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఫిదా చేస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More