మహేష్ లాంచ్ చేసిన “లవ్ స్టోరీ” సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్.!

Published on Mar 25, 2021 4:00 pm IST

ఇప్పుడు తెలుగు యువత మరియు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కొద్ది చిత్రాల్లో అక్కినేని నాగ చైతన్య మరియు సాయి పల్లవిలు హీరో హీరోయిన్స్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం కూడా ఒకటి. అలాగే ఈ చిత్రాన్ని ఆల్రెడీ సగం హిట్ గా సాంగ్స్ మార్చేశాయి. ఇప్పటి వరకు విడుదల కాబడిన ప్రతీ సాంగ్ ఒకదానిని మించి మరొకటి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.

మరి ఈరోజు లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ చేతులు మీదగా విడుదల చెయ్యబడ్డ నాలుగో సింగిల్ “ఏవో ఏవో కలలే” కు అనూహ్య రెస్పాన్స్ వస్తుంది. పవన్ సి హెచ్ రూపొందించిన ఈ రొమాంటిక్ మెలోడీ నెంబర్ కేవలం 5 గంటల్లోనే 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను అందుకొని మరో చార్ట్ బస్టర్ దిశగా వెళ్తుంది. మహేష్ తో లాంచ్ చేస్తున్నారంటే ముందే మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తానికి మాత్రం ఆ అంచనాలను ఈ సాంగ్ రీచ్ అయ్యిపోయిందని చెప్పాలి. మరి ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం వచ్చే ఏప్రిల్ 16న విడుదల కానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :