వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “లవ్ స్టోరీ”

Published on Dec 7, 2021 1:00 pm IST

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ల పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు లు నిర్మించడం జరిగింది. పవన్ సి హెచ్ సంగీతం అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయింది. వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం స్టార్ మా లో ప్రసారం కానుంది. థియేటర్ల లో అదరగొట్టిన ఈ చిత్రం బుల్లితెర పై ఏ విధంగా సందడి చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :