ఇంటర్వ్యూ : దిల్ రాజు- ‘లవర్’ పూర్తిగా హర్షిత్ కు చెందినదే !

Published on Jul 18, 2018 3:55 pm IST

రాజ్ తరుణ్ , రిద్ధి కుమార్ జంటగా నటించిన చిత్రం ‘లవర్’ ఈ గురువారం ప్రేక్షకులముందుకు రానున్న సంధర్బంగా చిత్ర సమర్పకుడు దిల్ రాజు మీడియా తో మాట్లాడారు.   ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం..
 
ఈ ప్రాజెక్టు ఎలా పట్టాలెక్కింది ?
అన్నీష్ కృష్ణ మొదటి చిత్రం ‘అలా ఎలా’ చూశాక నేను అతన్ని  మంచి స్టోరీ తో రమ్మని చెప్పా.   2016లో ఆయన ఈ థీమ్ తో నా దగ్గరకు వచ్చారు.  ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాక ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్ళింది.
మీరు హర్షిత్ ను నిర్మాతగా ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు ఆయన గురించి ?
హర్షిత్ ఇండస్ట్రీ లోనే పెరిగడం వల్ల  సినిమాలకు ఆకర్షితుడైయ్యాడు.  అతను కార్య నిర్వాహక ప్రొడ్యూసర్ గా నా సినిమాలకు పని చేశాడు.  ఆ సంధర్భంలో  నేను స్వతహాగా ఒక సినిమాను నిర్మిస్తాను నాతో చెప్పాడు.   తరువాత ఈ లవర్ స్క్రిప్ట్ ను అలాగే దానికి సరిపడా బడ్జెట్ ను సమకూర్చడం జరిగింది. హర్షిత్ ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుండి, విడుదల వరకు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తన్నాడు.
 
ఈ చిత్రం దేని గురించి ఉండనుంది ?
ఈ చిత్రం యొక్క థీమ్ చాలా సింపుల్ గా ఉంటుంది. అనాదయినా రాజ్ తరుణ్ , రిద్ధి కుమార్ చూసి ప్రేమలో పడుతాడు ఆమె కోసం ఎంతకైనా తెగించి ఆమె మనుసు గెలుచుకుంటాడు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనర్ గా సాగుతుంటుంది. సెకండ్ హాఫ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవుట్ ఫుట్ తో చాలా  కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రేక్షకుల ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎదురుచుస్తున్నాం.
 
రాజ్ తరుణ్,  రిద్ధి కుమార్ ల గురించి ?
రాజ్ తరుణ్ ఆయన పాత్రకి  కరెక్ట్ గా సరిపోయాడు. అలాగే ఆయన ఈ చిత్రంలో కొత్త లుక్ తో కనిపించనున్నాడు. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక హీరోయిన్ రిద్ది కుమార్ చాలా బాగా చేసింది. సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.
 
మీ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రాల గురించి ?
‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం తో ఆగష్టు 9న ప్రేక్షకులముందుకు రానున్నాం.  తరువాత రామ్ ‘హలొ గురు ప్రేమకోసమే’ చిత్రం కూడా బాక్సాఫిస్ వద్ద తప్పకుండా క్లిక్ అవుతుంది.  ఇక వచ్చే ఏడాది’ఎఫ్ 2′ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నాం.  అలాగే మహేష్ నటిస్తున్న 25వ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :