బాహుబలి 2 ని దాటేసిన సూపర్ స్టార్ సినిమా !

Published on Apr 4, 2019 8:29 am IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘లూసిఫెర్’ కేరళ లో కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మలయాళం లో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించగా తాజాగా మరో రికార్డు ను ఖాతాలో వేసుకుంది. కేరళ లో ఈ చిత్రం 6 రోజుల్లో 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసింది. ఇంతకుముందు బాహుబలి 2 అక్కడ 7 రోజుల్లో 30కోట్ల ను రాబట్టింది. ఇక లూసిఫెర్ 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం.

ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈచిత్రంలో వివేక్ ఒబెరాయ్ , మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :