
1990లో మే 9న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆకాలంలో భారీ వర్షాల మధ్య విడుదలై ఈ సినిమా ఆ తరువాత కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా చిరంజీవి, రాఘవేంద్ర రావు గారి కెరీర్లో మరుపురాని సినిమాగా నిలిచింది
ప్రస్తుతం జ్వరం కారణంగా రామ్ చరణ్ షూటింగ్ లకు చిన్న విరామం తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఒక సాయింత్రం చిరు, రాఘవేంద్ర రావుగారితో గడిపారు
24ఏళ్ళ క్రితం ఇదేరోజు వీరి కలయికలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా విడుదలైంది. అటువంటి బృందంతో ఈ సాయింత్రం గడపడం ఆనందకరం అని చెర్రి ట్వీట్ చేశాడు