ఓటిటి రివ్యూ : “లూడో”(హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

నటీనటులు : అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, రోహిత్ సురేష్ సరఫ్, పెర్ల్ మానీ

దర్శకత్వం : అనురాగ్ బసు

నిర్మాతలు : భూషణ్ కుమార్, దివ్య ఖోస్లా కుమార్, క్రిషన్ కుమార్, అనురాగ్ బసు, తాని బసు, దీపికా బోస్

సంగీతం : ప్రీతమ్

సినిమాటోగ్రఫీ : అనురాగ్ బసు, రాజేష్ శుక్లా

ఎడిటింగ్ : అజయ్ శర్మ

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న చిత్రం “లూడో”. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ “నెట్ ఫ్లిక్స్”లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్ అయినటువంటి సత్తు భయ్యా(పంకజ్ త్రిపాఠి) ఓ బిల్డర్ ను క్రూరంగా చంపేస్తాడు. ఇక ఇదే నేపథ్యంలో ఓ నలుగురు బిట్టు తివారి(అభిషేక్ బచ్చన్), ఆకాష్(ఆదిత్య రాయ్ కపూర్), ఆలు(రాజ్ కుమార్ రావ్) లాఫ్ శృతి(సన్యా మల్హోత్రా) లు ఈ హత్యలో తమకు తెలియకుండానే ఇరుక్కుంటారు. వాళ్ళు ఎలా ఇందులో చిక్కుకున్నారు? అందుకు కారణాలు ఏంటి? అసలు నిజం తెలుసుకున్నారా లేదా అన్నది అసలు ఇతివృత్తం.

ఏమి బాగుంది?

ముందుగా నటీనటుల పెర్ఫామెన్స్ కు వచ్చినట్టయితే గత కొన్నాళ్ల నుంచి నటుడు పంకజ్ త్రిపాఠి కు వస్తున్న సాలిడ్ రోల్స్ కు తగ్గట్టుగానే తన నటనను కనబరుస్తున్నారు. ఇప్పుడు ఈ లూడో లో కూడా అలాంటి రోల్ నే ఆయనకు మరోసారి ఇచ్చారు. అదే విధంగా ఈ రోల్ ను కూడా అత్యద్భుతంగా చేసారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ అండ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటాయి.

ఇక అలాగే మరో నటుడు రాజ్ కుమార్ రావ్ రోల్ లో కూడా సూపర్బ్ గా చేసాడు. మిథున్ చక్రవర్తిపై అతని కామెడీ ట్రాక్ బాగుంటుంది. వీరితో పాటుగా మరో స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ తన పాత్రను క్లీన్ గా చేసేసారు. అలాగే ఆదిత్య రాయ్ కపూర్ తన రోల్ కు ఒకే అని చెప్పొచ్చు.

ఇక ఫిమేల్ రోల్ లో కనిపించిన సన్యా మల్హోత్రా తనది చ్ఛిన్నా రోల్ అయినా సరే బాగా చేసింది. ఇక అలాగే వీరి అన్ని పాత్రలకు సంబంధించి డిజైన్ చేసినటువంటి బ్యాక్ డ్రాప్ స్టోరీ సమంజసంగా బాగుంటుంది. అలాగే ఈ చిత్రంలోని విజువల్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ముఖ్యంగా కామెడీ పలు కీలక సన్నివేశాల్లో బాగా ఎలివేట్ అయ్యింది. వీటన్నిటిని మించి నిర్మాణాత్మక విలువలు ఈ చిత్రంలో కనిపిస్తాయి.

ఏం బాగాలేదు?

ముందుగా చెప్పినట్టుగానే ఈ చిత్రంలో కనిపించే నాలుగు మెయిన్ రోల్స్ కు సంబంధించి మంచి బ్యాక్ డ్రాప్ స్టోరీలను దర్శకుడు అనురాగ్ తీసుకున్నారు. కానీ వాటిని బాగా లెంగ్తీ అండ్ స్లో గా చూపించడం వల్ల కాస్త డల్ అనిపిస్తుంది.

ఇక అలాగే స్క్రీన్ ప్లే ఇంకాస్త డిటైల్డ్ గా ఉంటే ఈ సినిమా చూసిన వెంటనే మొదటిసారే అర్ధం అయ్యే ఛాన్స్ ఉంది కానీ అలా చెయ్యలేదు. దీంతో కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలాగే సినిమాలో ఉన్న అనేక రోల్స్ ఉండడం వల్ల అనవసర సన్నివేశాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ లూడో చిత్రం మంచి ఆసక్తికర బ్యాక్ డ్రాప్ మరియు బాలీవుడ్ లో నోటెడ్ నటులు వారి నుంచి మంచి పెర్ఫామెన్స్ లతో మంచి గ్రిప్పింగ్ గా ఉంటుంది. కాకపోతే కాస్త లెంగ్తీ అండ్ స్క్రీన్ ప్లే కాస్త అర్ధం చేసుకోడానికి టైం పట్టినా పరవాలేదు అనుకుంటే ఈ లూడో ను ఓ లుక్కేయ్యొచ్చు.

Rating: 3/5

సంబంధిత సమాచారం :

More