కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను సొంతం చేసుకున్న మహేష్ హీరోయిన్ !

Published on Mar 2, 2019 6:26 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ చిత్రం తో సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ కృతి సనన్. ఇక ఈ చిత్రం తరువాత తెలుగులో నాగచైతన్య సరసన ‘దోచేయ్’ అనే చిత్రంలో నటించింది. ఈ రెండు కూడా ఆమె కు బ్రేక్ ఇవ్వకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లి అక్కడ బిజీ అయిపొయింది.

కృతి నటించిన తాజా చిత్రం ‘లుక చూప్పి’ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. దాంతో ఈచిత్రం మొదటి రోజు 8.01 కోట్ల వసూళ్లను రాబట్టింది. కృతి సనన్ కెరీర్ లో ఇదే బెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. ఇక ఈ మూడు రోజులుకూడా ఈచిత్రం మంచి వసూళ్లను రాబట్టుకోనుంది.

పక్క కామెడీ ఎంటర్టైనర్ గా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More