శంకర్ ను మరింత కట్టడి చేసే ప్రయత్నం

Published on May 14, 2021 11:00 pm IST

డైరెెక్టర్ శంకర్, లైకా నిర్మాతలకు నడుమ మొదలైన వివాదాలు ఇప్పటికీ సద్దుమణగలేదు. మధ్యవర్తులు ప్రయత్నించినా, స్వయంగా కోర్టువారే పరిష్కరించుకోమని తెలిపినా ఫలితం లేకపోయింది. లైకా నిర్మాతలకు, శంకర్ తరపు లాయర్ కు నడుమ జరిగిన చర్చల్లో శంకర్ సినిమాను జూన్ నుండి అక్టోబర్ మధ్యలో కంప్లీట్ చేసి ఇస్తారని లాయర్ తెలుపగా లైకా నిర్మాతలు మాత్రం జూన్ నాటికి సినిమాను ముగించి తీరాలని, ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదని పట్టుబట్టారు. దీంతో సమావేశం సఫలం కాక సమస్య మొదటికే వచ్చింది.

తాజాగా లైకా నిర్మాతలు తెలుగు, హిందీ ఫిల్మ్ చాంబర్స్ కు లేఖలు పంపారట. ‘ఇండియన్ -2’ పూర్తిచేసే వరకు మరో సినిమాను డైరెక్ట్ చేయకుండా ఆపాలని ఆ లేఖల్లో కోరారట. శంకర్ ఇటీవలే తెలుగులో రామ్ చరణ్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమాను, హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ రీమేక్ ప్రకటించారు. దీంతో లైకా నిర్మాతలు తమ చిత్రాన్ని కంప్లీట్ చేయకుండా శంకర్ వేరొక సినిమాను చేయడానికి వీల్లేదని నోటీసులు పంపడం, కోర్టుకు వెళ్లడం, కోర్టు జూన్ వరకు వాదనలను వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లైకా నిర్మాతలు రెండు పరిశ్రమలకు లేఖలు పంపారు. మరి వీటికి ఇరు పరిశ్రమల ఫిల్మ్ చాంబర్స్ ఎలా స్పందిస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :