“వినరో భాగ్యము విష్ణు కథ” ఫస్ట్ సింగిల్ పై చంద్రబోస్ ప్రశంసలు.!

“వినరో భాగ్యము విష్ణు కథ” ఫస్ట్ సింగిల్ పై చంద్రబోస్ ప్రశంసలు.!

Published on Dec 29, 2022 8:22 PM IST


టాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న నెక్స్ట్ సినిమా ఇది.

ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్నారు.కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి “వాసవసుహాస” అనే మొదటి సింగిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సాంగ్ తెలుగు సినిమా దగ్గర ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన సాహిత్య రచయిత చంద్రబోస్ ని అమితంగా మెప్పించడం విశేషం.

“యుగ యుగాలుగా ప్రభోదమై
పది విధాలుగా పదే పదే.
పలికేటి సాయ
జాడలే కదా నువ్వెదికినదిదైనా
చిరునికి జరిగినా చిరునవ్వుల ప్రాసనా
చిగురేయక అగురా
నిన్ను మార్చినా నిన్నటి అంచునా”

అని తెలుగు భాషలోని క్లిష్టమైన పదాలను ఈ పాటలో రచించారు గేయ రచయిత కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని. ఈ పాటకు మంచి ఆదరణ లభించి అన్ని వైపుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

మరి ఈ సాంగ్ పై చంద్రబోస్ అయితే సోషల్ మీడియాలో మాట్లాడుతూ “నేను ఈమధ్య విన్న పాటల్లో చాలా చాలా అరుదైన,విలువైన పాట -వినగానే ఆశ్చర్యానందానికి లోనైన పాట-వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలోని వాసవ సుహాస గీతం-రాయడానికి ఎంత ప్రతిభ వుండాలో దాన్ని ఒప్పుకోడానికి అంత అభిరుచి భాషా సంస్కరం వుండాలి – కవి కళ్యాణ్ చక్రవర్తి గారికి హృదయపూర్వక ఆశంసలు” అంటూ చంద్రబోస్ చెప్పుకొచ్చారు.

పైన ప్రస్తావించిన లిరిక్స్ లో “వాడికి సాయం చెయ్యమని చెప్పటానికి ఎత్తిన పది అవతారాలు ఆదర్శమే కదా నీది, అదే కదా నువ్వెళ్ళే దారి అలాంటి నీ దారిలో నవ్వులు పూయకుండా ఎలా ఉంటాయి. ఇప్పటి ఆలోచన నిన్నటి నీ అనుభవం నుండి వచ్చిందే కదా” అంటూ సారాంశాన్ని కూడా ఈ పాటలో జోడించడం విశేషం.

ఇక మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు