
ఈ రోజు ఉదయం తెలుగు సినిమా ప్రముఖులు, సాధారణ ప్రేక్షకులకు పెద్ద షాక్ తగిలింది. ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ చనిపోయారు అనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది. ఈ వార్త నిజమని పలువురు భావించారు. తర్వాత ఇది కేవలం పుకారని తేలింది. కొన్ని రోజులుగా మలేరియాతో బాధపడుతున్న ఎమ్మెస్ నారాయణకు మధ్యలో ఓసారి హార్ట్ ఎటాక్ కూడా వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కొండాపూర్ లో గల కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఎమ్మెస్ నారాయణ కుమార్తె, దర్శకురాలు శశి కిరణ్ ఈ పుకార్లను తీవ్రంగా ఖండించారు. మీడియాతో శశి కిరణ్ మాట్లాడుతూ.. నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నారు. త్వరగా నాన్నగారు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్దిస్తున్నాం. దయచేసి ఎటువంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దు. అని అన్నారు. ఎమ్మెస్ త్వరగా కోరుకోవాలని 123తెలుగు.కామ్ కోరుకుంటుంది.

