
సినీ ఇండస్ట్రీలోని వర్కర్స్ మంచి చెడుల చూసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నదే మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా). ఇటీవలే ఈ చాలా పోటా పోటీగా జరిగిన మా ఎలక్షన్స్ ముగియడం నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ మా ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వడం జరిగిపోయాయి. ఆయన ప్రెసిడెంట్ గా పదవి స్వీకరించినప్పటి నుంచి తన టీంతో కలిసి పనిచేస్తున్నారు. అంతే కాకుండా ఆయన ఎలక్షన్స్ అప్పుడు చెప్పినట్లు గానే పేద ఆర్టిస్ట్ లకు సంబందించిన పెన్షన్ నిధులను విడుదల చేసారు. మే డే కానుకగా చాలా మంది వర్క్సర్స్ కి మా ఆఫీసులో చెక్ లను అందజేశారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘భవిష్యత్తులో పేద కళాకారులకు ఇంకాస్త ఎక్కువగా మా నుంచి ఫైనాన్సియల్ సపోర్ట్ వచ్చేలా చూస్తామని’ తెలిపాడు. జెనరల్ సెక్రటరీ శివాజీరాజా మాట్లాడుతూ ‘మాకు అందుతున్న ఫండ్స్ ని అందరికీ పర్ఫెక్ట్ గా చేరేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొత్త అసోషియేషన్ ఫాం అయ్యాక మెగా ఫ్యామిలీ, పలువురు అమౌంట్ ని డొనేట్ చేస్తున్నారని’ అన్నాడు.

