టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర తన జోరును కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.43 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఆదివారం నాడు థియేటర్లలో భారీగా వసూళ్లు రావడంతో, ఈ సినిమా రూ.50 కోట్ల మార్కును దాటడానికి చాలా దగ్గరగా వచ్చేసింది.
ఈ జోరు సోమవారం కూడా కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో, అన్ని ప్రాంతాలలో ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పాజిటివ్‌గా సాగుతుండటంతో, ఈ సినిమా మొదటి వారం సాధించబోయే మొత్తం వసూళ్లపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ‘మా ఇంటి బంగారం’ ఇప్పటికే 1.3 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉండటం విశేషం. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, గౌతమి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.


