సిద్ధార్థ్ సినిమా సాటిలైట్ రైట్స్ డీటైల్స్

సిద్ధార్థ్ సినిమా సాటిలైట్ రైట్స్ డీటైల్స్

Published on Apr 28, 2015 10:31 AM IST

Nalo-okadu-sidhartha
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో మెరిసిన సిద్దార్థ్.. ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయారు. సిద్దార్థ్ తెలుగులో చేసిన చివరి సినిమా.. ‘జబర్దస్త్’. ఆ సినిమా పరాజయం తర్వాత సిద్ధూ తెలుగులో మళ్ళీ సినిమా చేయలేదు. అయితే ఈ సమయంలో తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోయారు. ‘జిగర్ తండా’, ‘కావ్య తలైవన్’, ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు. ఇందులో ‘జిగర్‌తండా’, ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాలు తెలుగులో ‘దిల్‌రాజు’, ‘నాలోఒకడు’ పేర్లతో విడుదల కానున్న విషయం తెలిసిందే!

తాజాగా హైద్రాబాద్‌లో ‘నాలో ఒకడు’ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కూడా జరిగింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తమిళంలో మంచి స్పందనే వచ్చింది. కాగా ప్రముఖ తెలుగు టీవీ చానల్ మాటీవీ ఈ సినిమాను సుమారు 70లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ముందుగా మే 1నే విడుదల చేయాలనుకున్నా తాజాగా సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

తాజా వార్తలు