చిత్రపురి కొత్త ప్రాజెక్టుపై ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి కామెంట్

చిత్రపురి కొత్త ప్రాజెక్టుపై ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి కామెంట్

Published on May 13, 2025 8:15 PM IST

Madala Ravi

చిత్రపురి కొత్త ప్రాజెక్టుపై మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “చిత్రపురి కొత్త ప్రాజెక్ట్ వలన చిత్రపురిలోని 9,000 మంది సభ్యులకి అలాగే కార్మికులకి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఫిలిం ఛాంబర్ లోని పెద్దలంతా కలిసి ఈ ప్రాజెక్టు కోసం ఒక తాటిపైకి వచ్చి సహాయం చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వలన ముఖ్యంగా కార్మికులకి మంచి జరగాలి. 4,500 సభ్యులు ఉన్నారు, అలాగే వెయిటింగ్ లిస్టులో కూడా ఎంతోమంది ఉన్నారు. ఆ వెయిటింగ్ లో ఉన్నవారికి కూడా మంచి జరగాలని, ఇప్పటికే చిత్రపురిపై ఎన్నో వివాదాలు ఈ మధ్య మీడియాలో వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత కమిటీ ఈ ప్రాజెక్టును ఎంతో ఆదర్శవంతంగా తీసుకుని ముందుకు సాగేలా కార్మికులకు ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నాను.

చిత్రపురి కాలనీ అనేది అన్ని సెక్టార్లు లాగా ఫిలిం ఇండస్ట్రీలో ఒక భాగం. ఫిలిం ఛాంబర్ వారు ఫిలిం ఇండస్ట్రీలోని అన్ని విభాగాలను ఆహ్వానించారు కాబట్టి మేము వచ్చి మా సందేశాన్ని తెలియచేస్తున్నాను. చిత్రపురి కాలనీలోని అందరికీ మంచి చేయాలని, చత్రపురి కాలనీలోని అందరి సభ్యులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము” అని అన్నారు

తాజా వార్తలు