నక్సలిజం నేపథ్యం లో వస్తున్న “మాజి”…పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్!

Published on Jul 15, 2021 10:12 pm IST


నక్సలిజం నేపథ్యం లో వస్తున్న తాజా చిత్రం మాజి. హీరోస్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. అయితే ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ఈ నెలాఖరు న సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దం గా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అండ్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం ఉండనుంది. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. హీరో వినోద్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.

అయితే ఈ చిత్రం లో యువ నటీనటులతో పాటుగా, పాత నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా, దర్శకుడు గా బి. వినోద్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొనడం జరిగింది.

సంబంధిత సమాచారం :