ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర ఫోటో పంచుకున్న మంచు లక్ష్మీ

Published on Jul 16, 2020 9:55 pm IST


కరోనా వైరస్ కారణంగా కొద్దిరోజులుగా సెలెబ్రిటీలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. చాలా వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ అందరిని భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే కొందరు బుల్లితెర నటులు మరియు సినీ ప్రముఖులు దీని బారిన పడ్డారు. హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉండగా ఎవరూ బయటికి రావడానికి సాహసించడం లేదు.

కాగా ఇంటిలోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అలాగే తమ వ్యాపకలలో మునిగిపోతున్నారు. కాగా మంచు లక్ష్మీ తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఆసక్తిర ఫోటో పంచుకున్నారు. ఆమె మంచు కుటుంబంలోని అందరు పిల్లలతో ఇంటి ఆవరణలోనే ఓ పిక్ నిక్ ప్లాన్ చేసినట్లున్నారు. ఆ ఫోటో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More