ఆగస్టు 6న రిలీజ్ కాబోతున్న ‘మ్యాడ్’!

Published on Jul 27, 2021 8:30 pm IST

కరోనా కారణంగా మొన్నటి వరకు థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు మళ్లీ తెరుచుకోనుండడంతో ఒక్కొక్కటిగా సినిమాలు రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ‘మ్యాడ్’ సినిమా కూడా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేత వర్మ ప్రధాన పాత్రలు పోషించిన ‘మ్యాడ్’ చిత్రానికి లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమా ఆగస్ట్ 6న థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో రెండు జంటల కథ ద్వారా చూపిస్తున్నామని చెప్పుకొచ్చారు. మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి తమ మిత్రులతో కలిసి నిర్మించారు.

సంబంధిత సమాచారం :