బన్నీ సినిమాలో మాధవన్ ?

Published on Sep 27, 2020 12:14 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’. కాగా తమిళ మాజీ హీరో మాధవన్ ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడట. విజయ్ సేతుపతి చేయాల్సిన రోల్ లో మాధవన్ చేయనున్నాడట. ఇక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాలి, అందుకే అడవిలోనే ఎక్కువ భాగం షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్.

ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ 20 నుండి స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారని.. అయితే ఈ సెట్స్ కేవలం సాంగ్స్ కోసమేనని.. నవంబర్ లో ఈ సెట్స్ లోనే బన్నీ – రష్మిక పై రెండు సాంగ్స్ ను తీయబోతున్నారని తెలుస్తోంది. అయితే సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో మాత్రమే షూటింగ్ స్టార్ట్ చేస్తారట.

ఇక ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ కోసం బాలీవుడ్‌ హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంకా ఎవరు సెట్ కాలేదు. దాంతో యంగ్ బ్యూటీ అనన్య పాండేను ఫైనల్ చేసే ప్లాన్ లో ఉందట చిత్రబృందం. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More