ఆర్ ఆర్ ఆర్ మూవీ పై మాధవన్ కీలక వ్యాఖ్యలు!

Published on Jan 4, 2022 3:30 pm IST

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం ను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ థర్డ్ వేవ్ తో వాయిదా ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు ఈ సినిమా పై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు నాటు నాటు పాటకు రెస్పాండ్ అయిన హీరో మాధవన్, తాజాగా మరొకసారి ఆర్ ఆర్ ఆర్ మూవీ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. థియేటర్ సమస్యలు ఉన్నాయని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఆర్ ఆర్ ఆర్ మూవీ చేసిన వ్యాఖ్యల పట్ల మాధవన్ స్పందిస్తూ, మీరు కచ్చితంగా ఆ సమస్యలను అధిగమిస్తారు అని అన్నారు. అంతేకాక గ్రేట్ నెస్ కోసం ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :