హాస్పిటల్లో మాధవన్.. ఏమైంది !
Published on Feb 26, 2018 2:51 pm IST


ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్న నటుడు మాధవన్ ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఉన్న ఫోటో ఒకదాన్ని పోస్ట్ చేశారు. దీని చూసి అభిమానులు కొంత కంగారుపడినా విషయం తెలిసి సర్దుకున్నారు. ఈ ఫోటోతో పాటు మాధవన్ తన కుడిచేతికి ఆపరేషన్ చేయించుకున్నానని, సర్జరీ విజయవంతంగా పూర్తైందని స్టేట్మెంట్ ఇచ్చారు.

హీరోగా పలు హిట్ సినిమాల్లో నటించిన మాధవన్ ఈ మధ్య ‘ఇరుద్ది సుత్త్రు, విక్రమ్ వేద, మగలిర్ మట్టుమ్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రస్తుతం ఈయన తెలుగులో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ‘సవ్యసాచి’లో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన చేసిన అమెజాన్ వెబ్ సిరీస్ ‘బ్రీత్’ మంచి ప్రశంసలు అందుకుంటోంది.

 
Like us on Facebook