యాంకర్ నుంచి నటిగా మారిన ట్యాలెంటెడ్ బ్యూటీ మధు శాలిని ఈసారి కొత్త అవతారంలో మనల్ని పలకరించేందుకు సిద్ధమైంది. ‘కన్యాకుమారి’ అనే హృద్యమైన గ్రామీణ ప్రేమకథను ఆమె నిర్మాతగా మారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ర్యాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టడ కథ, దర్శకత్వం, నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజాగా ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ సరికొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేవారు. “ఆర్గానిక్ ప్రేమ కథ” అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. శ్రీకాకుళం గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకు రవి నిదమర్తి సంగీతం అందిస్తుండగా శివ గాజుల మరియు హరిచరణ్ కె సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నరేష్ అడుపా ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


