“మధుర వైన్స్” నుంచి ఆకట్టుకుంటున్న రొమాంటిక్ నెంబర్!

“మధుర వైన్స్” నుంచి ఆకట్టుకుంటున్న రొమాంటిక్ నెంబర్!

Published on Aug 29, 2021 2:00 PM IST

ఇటీవల సోషల్ మీడియా ఫాలోవర్స్ లో మంచి బజ్ తెచ్చుకుంటున్న చిత్రాల్లో సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం “మధుర వైన్స్” కూడా ఒకటి.. ‘గతం’, ‘తిమ్మరుసు’ లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా బాగానే పెరిగింది.

త్వరలో ఎస్ ఒరిజనల్స్ నుంచి అద్భుతం, పంచతంత్రం చిత్రాలు కూడా రాబోతున్నాయని.. మధుర వైన్స్ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని.. సినిమా మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని ధీమాగా చెప్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ఏదో ఏదో రొమాంటిక్ వీడియో సాంగ్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ రొమాంటిక్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సెప్టెంబర్ 17న మధుర వైన్స్ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని చెప్పారు. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్నారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని మేకర్స్ తెలియజేసారు.

 

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు