యోగా దినోత్సవంలో భాగంగా మాధురి దీక్షిత్‌ ఆసనాలు !

Published on Jun 20, 2021 1:02 am IST

యోగా మనిషికి ఎంతో మేలు చేస్తోంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా యోగా ఎంతో ఆదరణను పొందుతోంది. ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాతో ఆరోగ్యాన్నిపెంచుకుంటున్నారు. ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా యోగాతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు అనే నమ్మకంతో సినీ తారలంతా ఇప్పుడు యోగా ఆసనాలు వేస్తున్నారు.

అయితే, జూన్‌ 21 అంతర్జాతీయ యోగా డే. మరో రెండు రోజులు ఈ యోగా డే వస్తోంది. మరి ఈ సందర్భంగా బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌ తప యోగా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘యోగా నా రోజు వ్యాయమంలో తప్పనిసరి అయింది, నా జీవితంలో ఒక భాగం అయ్యింది. త్వరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలు మీకోసం. రండి నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి’ అంటూ మాధురి దీక్షిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఆసనాలను చూపించింది.

సంబంధిత సమాచారం :