సీతగా కనిపించనున్న మధు శాలిని

సీతగా కనిపించనున్న మధు శాలిని

Published on Apr 24, 2014 1:02 PM IST

Madhushalini
అడపాదడపా తెలుగు, తమిళ సినిమాల్లో కనిపిస్తూనే ఉన్న మధుశాలినికి బ్రేక్ ఇచ్చే సరైన ఆఫర్ ఒక్కటి కూడా రావడం లేదు. అందుకే ఈ సారి సీత పాత్రలో కనిపించి తన లక్ ని పరీక్షించుకోనుంది. అది కూడా ఓ షార్ట్ ఫిల్మ్ లో కావడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ కి మాదాల వేణు డైరెక్టర్. సీత ప్రకారం ఈ షార్ట్ ఫిల్మ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

సీత పాత్ర అనేది చాలా కష్టం అని చెప్పే మధు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ ఫిల్మ్ షూటింగ్ పూర్తైన తర్వాత చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

తాజా వార్తలు