దళపతి విజయ్‌కి రూ.లక్ష జరిమాన..!

Published on Jul 13, 2021 9:02 pm IST

తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తన రోల్స్‌ రాయిస్‌ లగ్జరీ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అయితే నేడు దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం విజయ్ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టిపారేసింది. పౌరులు చట్టబద్ధంగా నడుచుకునేలా ఆదర్శంగా ఉండాల్సిన వారు కూడా ఇలా పన్ను మినహాయింపు కోరడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది.

అయితే సినిమాల్లో అవినీతి వ్యతిరేక పాత్రల్లో నటిస్తున్న హీరోలు పన్నులు కట్టడంలో విఫలమవుతున్నారని, నిజాయితీగా పన్ను కట్టేవాడే అసలైన హీరో అని కోర్టు చెప్పుకొచ్చింది. విజయ్ కొన్న లగ్జరీ కారుకు పన్ను చెల్లించడానికి రెండు వారాల గడువిచ్చింది. దీంతోపాటు పన్ను కట్టకుండా ఉన్నందుకు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ, ఈ మొత్తాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కోవిడ్ సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించింది.

సంబంధిత సమాచారం :