విశాల్ మాకు 8.29 కోట్లు అప్పున్నాడంటూ కోర్టులో కేసు

Published on Sep 22, 2020 11:31 pm IST

హీరో, నిర్మాత విశాల్ ప్రజెంట్ ఆనందన్ ఎమ్.ఎస్ దర్శకత్వంలో ‘చక్ర’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మీద నిర్మిస్తున్నారు. చివరి దశ పనుల్లో ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ఓటీటీ ద్వారా విడదలచేయాలని విశాల్ నిర్ణయించారు. అన్ని దక్షిణాది భాషల్లోనూ ఓటీటీ ద్వారానే రిలీజ్ చేయనున్నారు. కానీ నిర్మాణ సంస్థ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ హైకోర్టులో కేసు వేసింది. విశాల్ తమకు బాకీ ఉన్నాడని, ఇచ్చిన అగ్రిమెంట్ తప్పాడని ట్రైడెంట్ ఆర్ట్స్ ఆరోపిస్తోంది.

వివారాల్లోకి వెళితే విశాల్ గతంలో ‘యాక్షన్’ పేరుతో ఒక సినిమా చేశాడు. ఆ చిత్రాన్ని నిర్మించింది ఇప్పుడు విశాల్ మీద పిటిషన్ వేసిన ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థే. ఆ సినిమాకు 44 కోట్లు ఖర్చయ్యాయని, విశాల్ 20 కోట్లకు గ్యారెంటీ ఉంటానని, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే తన బ్యానర్లోనే ఇంకో సినిమా చేస్తానని మాటిచ్చారని, కానీ ‘యాక్షన్‌’ సినిమా తమిళనాడులో 7.7 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు మాత్రమే వసూలు చేసిందని, కాబట్టి విశాల్ తమకు ఇంకా 8.29 కోట్లు బాకీ ఉన్నాడని, చేస్తానన్న సినిమా కూడ చేయలేదని కనుక ఆ డబ్బు చెల్లించే వరకు ‘చక్ర’ సినిమాను విడుదలను ఆపాలని కేసు వేసింది. దీంతో ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విశాల్, ఎంఎస్ ఆనందన్‌లకు నోటీసులను జారీ చేసింది.

సంబంధిత సమాచారం :

More