మాస్ట్రో నుండి స్నేక్ పీక్ ను విడుదల చేయనున్న చిత్ర యూనిట్!

Published on Aug 29, 2021 8:07 pm IST

నితిన్ హీరోగా, నబ్బా నటేష్, తమన్నా భాటియా లు లీడ్ రోల్స్ లో నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రం 2018 లో విడుదల అయిన హిందీ అంధధూన్ చిత్రానికి రీమేక్ కావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హీరో నితిన్ ఈ చిత్రం లో అంధుడు గా నటించడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాక ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుండి స్నేక్ పీక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు ఇందుకు సంబంధించిన స్నేక్ పీక్ విడుదల కానుంది. ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17 వ తేదీ నుండి ప్రసారం కానుంది. ఈ చిత్రానికి మహతీ స్వర సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :