నితిన్ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన హాట్‌స్టార్..!

Published on Aug 28, 2021 8:38 pm IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్ట్రో”. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అంధధూన్’కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమా సెప్టెంబ‌ర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ అధికారికంగా తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :