‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లోనే నితిన్ “మాస్ట్రో”..!

Published on Aug 20, 2021 12:00 am IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్ట్రో”. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అంధధూన్’కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా? లేక ఓటీటీలో రిలీజ్ అవుతుందా? అనే విషయంలో కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా ఓటీటీలోనే విడుదల కాబోతుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఈ సినిమాను 32 కోట్లకు తీసుకుందని, ‘వినాయకచవితి’ కానుకగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :