జనవరి 1న మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘మ్యాజిక్’ విడుదల

జనవరి 1న మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘మ్యాజిక్’ విడుదల

Published on Dec 31, 2025 6:08 AM IST

Magic Marathi Movie Release

టుత్రీ వెంచర్స్ బ్యానర్‌పై రాజు సత్యం నిర్మించిన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘మ్యాజిక్’ (Magic). జితేంద్ర జోషి ప్రధాన పాత్రలో రవీంద్ర విజయ్ కర్మార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశానికి ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. నిర్మాత రాజు సత్యం నాకు మంచి మిత్రుడు. హైదరాబాద్‌లోని మరాఠీ ప్రేక్షకులంతా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి హిట్ చేయాలి’ అని కోరారు. విడుదలకంటే ముందే ఈ చిత్రం 9 అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషమని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రశంసించారు.

కథలోని వైవిధ్యం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించానని, హైదరాబాద్ మరాఠీలకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని నిర్మాత రాజు సత్యం ఆశాభావం వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్ వంటి బాలీవుడ్ ప్రముఖుల మద్దతు తమకుందని, ఇందులో తాను పోషించిన పాత్ర ఎంతో క్లిష్టమైనదని హీరో జితేంద్ర జోషి తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు