100 కోట్ల క్లబ్ లోకి “మహారాజ”

100 కోట్ల క్లబ్ లోకి “మహారాజ”

Published on Jul 3, 2024 11:05 PM IST

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ జూన్ 14, 2024న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. రిలీజైన తొలిరోజు నుండే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకూ 100.18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్లు రాబట్టడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కురంగు బొమ్మై ఫేమ్ నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు