ఆకట్టుకుంటున్న ‘మహర్షి’ ‘పదరా పదరా’ !

Published on Apr 24, 2019 10:04 pm IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుండి ‘పదరా పదరా’ సాంగ్ ను విడుదల చేసంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా శంకర్ మహదేవన్ తన గాత్రంతో ఈ పాట స్థాయిని పెంచారు. ఇక రచయిత శ్రీమణి మంచి సాహిత్యం రాశారు.

కాగా మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :