మహర్షి విడుదలపై మరో సారి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు !

Published on Feb 27, 2019 11:41 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న25వచిత్రం ‘మహర్షి’ విడుదల వాయిదాపడనుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. రెండు సాంగ్స్ మినహా ఈచిత్రం యొక్క షూటింగ్ మార్చి 15న పూర్తి కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా అనుకున్నట్లు ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదలకానుందని అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ చిత్రం యొక్క టీజర్ ను మహాశివరాత్రి రోజు మార్చి 4న విడుదలచేయనున్నారా లేదా అనే విషయం ఫై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి ఈసినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :