సెన్సార్ పూర్తీ చేసుకున్న మహర్షి – నో కట్స్

Published on May 4, 2019 12:58 am IST

మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం మహర్షి. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకులముందుకు రానుంది. కాగా ఈ చిత్రం నేడు సెన్సార్ పూర్తీ చేసుకుంది. ఈ చిత్రం పై ఇప్పటికే బారి అంచనాలు నెలకొన్నాయి. చాల గ్యాప్ తరువాత దర్శకుడు వంశీపైడిపల్లి తీస్తున్న సినిమా కావడం, ఇంకా మహేష్ బాబు ది 25వ సినిమా కావడంతో అభిమానుల అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ చిత్రం లో మహేష్ బాబు కూడా చాలా కష్టపడ్డారని చెబుతున్నారు చిత్ర బృందం. అంతేకాకుండా ఈ చిత్రంతో మ‌హేశ్ బాబు బ్లాక్ బ‌స్ట‌ర్ విజయాన్ని అందుకోవడం ఖాయమనే చెబుతున్నారు.

కాగా ఈ చిత్రంకు ఎలాంటి అడ్డంకులు లేని క్లీన్ యు బై ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. కాగా ఈ సినిమాను దిల్ రాజు, పివిపి, అశ్వినిద‌త్ సంయుక్తంగా నిర్మించారు. మహర్షి సినిమాలో కొన్ని యాక్ష‌న్ సన్నివేశాలతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే గ్లామ‌ర్ కూడా ఉండ‌టంతో యు తోడుగా ఏ కూడా ఇచ్చింది సెన్సార్ బోర్డ్. పైగా ఈ చిత్రానికి మంచి టాక్ కూడా రావ‌డంతో దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా ఈ చిత్రంతో మహేష్ బాబు మరో మైలు రాయిని చేరుకుంటాడని దర్శకుడు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More