మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు !

Published on Apr 24, 2019 10:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ షూటింగ్ కంప్లీట్ చేసుకోని ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా టీజర్ తోపాటు ఇటీవల మూడు పాటలను విడుదలచేయగా ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఈ చిత్రం నుండి పదరా పదరా అనే సాంగ్ ను విడుదలచేయనున్నారు.

ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ముహూర్తం ఖరారు చేశారు. మే 1న నక్లెస్ రోడ్డు లోని పీపుల్ ప్లాజా లో సాయంత్రం 6గంటలకు ఈ ఈవెంట్ గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :