రికార్డు స్థాయిలో విడుదలవుతున్న మహర్షి !

Published on May 7, 2019 11:21 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి ఈనెల 9న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతుంది. ఇక ఈ చిత్రం బెంగుళూరు లో రికార్డు స్థాయిలో 400 కు పైగా స్క్రీన్లలో విడుదలకానుందని సమాచారం. బెంగుళూరు లో కూడా మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మహేష్ బాబు త్రీ షేడ్స్ లో కనిపించనున్నాడు. ఇక ఈచిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ప్రముఖ హీరో అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , పివిపి , అశ్వినీ దత్ లు కలిసి నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం మహేష్ కేరీర్ లో మెమొరబుల్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More