మహేష్ ‘మహర్షి’ తో సెంచరీ కొట్టాడు .

Published on Aug 16, 2019 12:39 pm IST

దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రిన్స్ మహేష్ హీరోగా చేసిన తాజా చిత్రం మహర్షి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మహర్షి తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా నైజాం లో మహర్షి 30కోట్లకు పైగా షేర్ సాధించి రికార్డు నమోదు చేసింది. కాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మూవీ ఐదు సెంటర్స్ లో వంద రోజులు పూర్తిచేసుకుంది. వీటిలో మూడు డైరెక్ట్ వందల రోజుల ప్రదర్శించబడిన థియేటర్స్ కాగా మరో రెండు షిఫ్టెడ్ సెంటర్స్.

వైజాగ్,చిలకలూరిపేట,ఆదోని సెంటర్స్ లో మహర్షి నేరుగా వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. గుంటూరు,నెల్లూరు లో మాత్రం షిఫ్టెడ్ థియేటర్లలో వంద రోజులు ఆడింది. ప్రస్తుత పరిస్థుతుల దృష్ట్యా ఇది చెప్పుకోదగ్గ విషయమే. మహర్షి మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్ర చేశారు.మహేష్ ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం తరువాత మళ్ళీ ఆయన వంశీ పైడిపల్లి చిత్రంలో నటించే యోచనలో ఉన్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :