‘మహర్షి’ న్యూ అప్ డేట్ !

Published on Dec 25, 2018 7:13 pm IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ చిత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ విలేజ్ సెట్ లో ఈ రోజుతోటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో సాగే సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేశారు. సెకెండాఫ్ లో వచ్చే ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట.

కాగా మహర్షి తరువాత షెడ్యూల్ జనవరి నుండి మొదలు కానుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :