‘మహర్షి’కి ‘శ్రీమంతుడు’ పోలికలు.. నిజమేనా ?

Published on Apr 25, 2019 2:00 am IST

‘మహర్షి’ పోస్టర్స్, టీజర్ లో కాస్త శ్రీమంతుడు ఛాయలు కనిపించడంతో, మహర్షి కథ ‘శ్రీమంతుడు’ నుండే పుట్టిందని.. అందుకే మహర్షిలో శ్రీమంతుడు పోలికలు ఎక్కువుగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు గాని.. ఒక విధంగా ఈ ప్రచారానికి కారణం మాత్రం ‘మహర్షి’ టీమే. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన మహర్షి పోస్టర్స్, సాంగ్స్ దగ్గర నుండీ మహేష్ గెటప్, సినిమా టీజర్ వరకూ ఎక్కడో ఓ చోట ‘శ్రీమంతుడు’ను గుర్తుకుతెస్తూనే వచ్చారు.

ఇది కావాలని చెయ్యకపోయినా ఆ సినిమా ఛాయలు పడకుండా చూసుకోవాల్సింది. దీనికి కారణం బహుశా స్టోరీ థీమ్ కూడా కావొచ్చు. రెండు కథల్లో అపర కోటేశ్వరుడైన హీరో తన జీవితంలో జరిగిన కొన్ని కారణాల కారణంగా ఓ ఊరుకి రావడం, అక్కడి పరిసర ప్రాంతాల్లోని చెడును ఎదిరించి.. తాను చెయ్యాలనుకున్న మంచిని చెయ్యడం’. రెండు సినిమాల ఇతివృత్తం ఒకేలా ఉండటం కూడా ఈ పోలికలకు కారణమే.

అయితే మహర్షి ‘శ్రీమంతుడు’ ఫార్మెట్ నే ఫాలో అవ్వడం, పైగా ‘శ్రీమంతుడు’లో కనిపించిన లొకేషన్స్ లాంటివి.. మహర్షిలోనూ ఎక్కువగా కనిపించడం.. ముఖ్యంగా ‘శ్రీమంతుడు’లో తోట ఫైట్ ‘మహర్షి’లో కూడా అలాంటి తోట ఫైటే ఉండడంతో ‘మహర్షి’ పై కాపీ ముద్ర బలంగా పడింది. ఇప్పటి నుండైనా మహర్షి టీమ్ తమ సినిమాలో ‘శ్రీమంతుడు’ ఛాయలు లేకుండా చేసుకుంటే మంచింది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :