‘మహర్షి’ లేటెస్ట్ అప్డేట్స్ !

Published on Sep 30, 2018 4:00 am IST

‘భరత్ అనే నేను’చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’. ఈచిత్రం ఇప్పటివరకు డెహ్రాడూన్, హైద్రాబాద్లలో 3 షెడ్యూల్ ను ముగించుకొని తదుపరి షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లనుంది. ఇక ఈషెడ్యూల్ అక్టోబర్ 15న ప్రారంభం కానుందని సమాచారం. సుమారు 15రోజులపాటు జరుగనున్న ఈ షెడ్యూల్లో చిత్రానికి కీలకం కానున్న సన్నివేశాలతో పాటు రెండు సాంగ్స్ ను కూడా తెరకెక్కించనున్నారు. ఆతరువాత తిరిగి చిత్ర బృందం హైదరాబాద్ చేరుకొని మిగిలిన షూటింగ్ ను కంప్లీట్ చేయనుంది.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నఈచిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్,మహేష్ స్నేహితుడిగా కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, పివిపి, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :