మహర్షి కి తప్పని లీకుల బెడద !

Published on Jan 30, 2019 1:18 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం మహర్షి ఇటీవలే పొల్లాచి లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఆ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అందులో పచ్చని పొలాల మధ్య మహేష్ మీడియా తో మాట్లాడే సన్నివేశాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో చిత్ర యూనిట్ అప్రమత్తం అయ్యి సెట్ లోకి సెల్ ఫోన్ లు తీసుకురాకుండా చూడాలని డిసైడ్ అయ్యారట.

ఇక ఈ చిత్రంలో మహేష్ బిజినెస్ మేన్ గా అలాగే రైతు పాత్రలో కూడా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు , పివిపి , అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More