మహర్షి నుండి రెండవ సాంగ్ విడుదలకానుంది !

Published on Apr 11, 2019 10:16 am IST

భరత్ అనే నేను తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ సినిమా ఫై సహజంగా నే మంచి అంచనాలు వున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ అలాగే మొదటి సాంగ్ చోటి చోటి ఈఅంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ చిత్రంలోని రెండవ సాంగ్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదలచేయనున్నారు.

‘ఊపిరి’ తరువాత వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మే 9న భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :