మహర్షి సాంగ్ షూటింగ్ అప్డేట్ !

Published on Apr 4, 2019 12:25 pm IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ ఒక్క సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 15 నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్క్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మహేష్ తన పాత్రకు డబ్బింగ్ చెపుతున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను ఏప్రిల్ 6న విడుదలచేయనున్నారు.

ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ హీరో అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :