రేపటి నుండి మహర్షి సాంగ్ షూట్ షురూ !

రేపటి నుండి మహర్షి సాంగ్ షూట్ షురూ !

Published on Mar 30, 2019 6:59 PM IST

Maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ ఇటీవల టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. మరో రెండు సాంగ్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ వుంది. అందులో ఒక సాంగ్ షూటింగ్ ను రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించనున్నారని సమాచారం.

ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సోషల్ మెసేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు