ఆలస్యంగా ప్రారంభం కానున్న ‘మహర్షి’ యూఎస్ షెడ్యూల్ !

ఆలస్యంగా ప్రారంభం కానున్న ‘మహర్షి’ యూఎస్ షెడ్యూల్ !

Published on Sep 24, 2018 8:52 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ చిత్రం యొక్క లేటెస్ట్ షెడ్యూల్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కావాల్సి ఉండగా వీసా విషయంలో జాప్యం వల్ల వాయిదా పడి అక్టోబర్ రెండవ వారంలో ప్రారంభం కానుంది. సుమారు 25రోజులపాటు జరిగే జరుగనున్న ఈ షెడ్యూల్లో చిత్రానికి కీలకం కానున్న సన్నివేశాలతో పాటు రెండు సాంగ్స్ ను కూడా తెరకెక్కించనున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, పివిపి , అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు