‘మహర్షి’ హిందీ డబ్బింగ్ రైట్స్ కు… భారీ ధర !

‘మహర్షి’ హిందీ డబ్బింగ్ రైట్స్ కు… భారీ ధర !

Published on Apr 3, 2019 8:02 AM IST

మహేశ్ బాబు – వంశీ పైడిపల్లి కలయికలో రానున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ సంస్థ 11 కోట్లకు కొనగా.. శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ 16.8 కోట్లకు కొనుగోలు చేసిందని మేము ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా ‘మహర్షి’ హిందీ డబ్బింగ్ రైట్స్ కు కూడా 26 కోట్ల భారీ ధర పలికింది. ఇక ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు