భారీ ధరకు ‘మహర్షి’ శాటిలైట్ రైట్స్ !

భారీ ధరకు ‘మహర్షి’ శాటిలైట్ రైట్స్ !

Published on Apr 2, 2019 8:02 AM IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ సంస్థ 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని నిన్న మేము వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను కూడా జెమినీ టీవీ 16.8 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు