“మహా సముద్రం” డిజిటల్ రైట్స్‌కి భారీగా ధర వచ్చిందిగా?

Published on Aug 29, 2021 3:00 am IST

శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా “మహా సముద్రం”. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అను ఎమ్మన్యూల్, అదితి రావు హైదరి, జగపతి బాబు, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 14న రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు మంచి ధర వచ్చినట్టు అలికిడి.

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్ 10.5 కోట్లకు దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు తెలుస్తుంది. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఇలా అన్నిటిపరంగా చూసుకుంటే మహా సముద్రం సినిమాకు మంచి లాభాలే వచ్చేలా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :